TCS Jobs: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకి శుభవార్త..TCSలో 40,000వేల ఉద్యోగాలు..!

TCS Jobs: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకి శుభవార్త..TCSలో 40,000వేల ఉద్యోగాలు..!

Update: 2022-08-21 05:19 GMT

TCS Jobs: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకి శుభవార్త..TCSలో 40,000వేల ఉద్యోగాలు..!

TCS Jobs: కరోనా వైరస్ తర్వాత చాలా కంపెనీలు ఇప్పుడు నిరుద్యోగులకి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడానికి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) కోవిడ్ సమయంలో కూడా ఫ్రెషర్లకు ఉద్యోగాలు కకల్పించింది. టాటా గ్రూప్‌నకు చెందిన టీసీఎస్ ఐటీ కంపెనీ గ్రాడ్యుయేట్ యువత కోసం మరోసారి బంపర్ రిక్రూట్‌మెంట్లను తీసుకొచ్చింది.

దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గతేడాది మాదిరిగానే 40 వేల మందిని రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. 40000 మంది ఉద్యోగులతో పాటు లక్ష మంది ఫ్రెషర్లను కూడా క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకోనున్నట్లు టీసీఎస్ తెలిపింది. ప్రస్తుతం టీసీఎస్‌లో 5,92,125 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చదువుతున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత

2019, 2020 లేదా 2021 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు "కనీస మొత్తం (అన్ని సెమిస్టర్‌లలోని అన్ని సబ్జెక్ట్‌లు) 60% లేదా 6 CGPAని ప్రతి తరగతి X, XII, డిప్లొమా కలిగి ఉఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల అందించే ఏదైనా స్పెషలైజేషన్‌లో BE/B.Tech/ME/M.Tech/MCA/M.Sc కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అఅర్హులు అవుతారు.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1.అభ్యర్థులు ముందుగా https://nextstep.tcs.com/campus/లో పోర్టల్‌ని సందర్శించాలి.

2.హోమ్‌పేజీలో TCS ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేయడానికి IDని రూపొందించాలి.

3.కొత్త వినియోగదారులు 'డ్రైవ్ కోసం దరఖాస్తు' ఎంపికపై క్లిక్ చేయాలి.

4.'రిజిస్టర్ నౌ'ఎంపికపై క్లిక్ చేయాలి.

5.ఇప్పుడు 'IT'వర్గాన్ని ఎంచుకోవాలి.

6.మీ వివరాలను నమోదు చేసి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.

Tags:    

Similar News