SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ఇంటర్ అర్హత..!
SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ఇంటర్ అర్హత..!
SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. లడఖ్‌లోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ మొదలైన వివరాలు తెలుసుకుందాం.
మొత్తం పోస్టులు 797. అందులో జూనియర్ అసిస్టెంట్/ఎలక్షన్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, స్టాటిస్టికల్ అసిస్టెంట్/జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్, డ్రైవర్ గ్రేడ్-II, ఆర్డర్లీ, సఫాయివాలా, బేరర్ తదితర పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
రాత పరీక్ష (CBT) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 13, 2022గా నిర్ణయించారు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్ధులకు రూ.100. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌సర్వీస్ మెన్/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష ఆగస్టులో ఉంటుంది.