నిరుద్యోగులకి అలర్ట్‌.. SSC GD కానిస్టేబుల్ చివరితేదీ దగ్గరపడింది..!

SSC GD Constable Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ (SSC) కానిస్టేబుల్‌ జీడి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Update: 2022-11-26 14:27 GMT

నిరుద్యోగులకి అలర్ట్‌.. SSC GD కానిస్టేబుల్ చివరితేదీ దగ్గరపడింది..!

SSC GD Constable Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ (SSC) కానిస్టేబుల్‌ జీడి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ దగ్గరపడింది. ఇప్పటి వరకు అప్లై చేసుకోలేకపోయిన అభ్యర్థులు 30 నవంబర్ 2022 వరకు సమయం ఉంది. SSC రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్- ssc.nic.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

SSC జారీ చేసిన ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ 27 అక్టోబర్ 2022 నుంచి ప్రారంభమైంది. చివరి తేది 30 నవంబర్ 2022. ఈ పోస్టులకు ఫీజు డిపాజిట్ చేయడానికి 01 డిసెంబర్ 2022 వరకు సమయం ఉంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జనవరి 2023లో నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా భారతీయుడై ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ, 23 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inకి వెళ్లండి.

2. వెబ్‌సైట్‌లో ఇప్పటికే నమోదు కాకపోతే కొత్త వినియోగదారుపై క్లిక్ చేయడం ద్వారా పేరు నమోదు చేసుకోండి.

3. ఇప్పుడు రిజిస్ట్రేషన్-నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.

4. ఇప్పుడు CAPFలలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో SSF, రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2022లో సిపాయి కోసం లింక్‌కి వెళ్లండి.

5. ఇప్పుడు అడిగిన అవసరమైన వివరాలను పూరించండి. అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.

6. ఇప్పుడు డిక్లరేషన్‌ను జాగ్రత్తగా చదవండి. దానిని అంగీకరిస్తే నేను అంగీకరిస్తున్నాను చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి. క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి.

SSC GD కానిస్టేబుల్ పోస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఫీజు డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే పూర్తవుతుంది. ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 ఫీజుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

Tags:    

Similar News