Voter Card: ఓటర్‌ కార్డు లేకుంటే కాలేజీల్లో అడ్మిషన్ బంద్.. ఎక్కడంటే..?

Voter Card: మహారాష్ట్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2022-11-25 13:20 GMT

Voter Card: ఓటర్‌ కార్డు లేకుంటే కాలేజీల్లో అడ్మిషన్ బంద్.. ఎక్కడంటే..?

Voter Card: మహారాష్ట్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2023-24 అకడమిక్ నుంచి యూనివర్సిటీ అడ్మిషన్‌లో చాలా పెద్ద మార్పులు చేసింది. వీటిలో ఒకటి ఓటరు కార్డు తప్పనిసరి. మీ వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ఓటరు ఐ-కార్డ్‌ని కలిగి ఉండాలి. లేదంటే మహారాష్ట్ర కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోలేరు. యువతలో ఓటుపై అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది కాకుండా మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీకాంత్ దేశ్‌పాండే మహారాష్ట్రలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కళాశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా విద్యార్థులు ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కాగలరని చెప్పారు. విశేషమేమిటంటే ప్రస్తుతం రాష్ట్రంలోని 90 శాతం యూనివర్సిటీలు కళాశాలల విద్యార్థులు ఓటరు నమోదు జాబితాకు దూరంగా ఉన్నారు.

3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ముగిసినట్లే..!

ఓటర్ ఐడిని తప్పనిసరి చేయడంతో పాటు యువత ఓటు వేయడానికి, ఎన్నికలతో కనెక్ట్ అయ్యేలా ప్రోత్సహించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. అంటే 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ముగిసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సు నాలుగేళ్ల వ్యవధి ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం (NEP 2020) కింద అమలవుతుంది.

2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంలో 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సుకు నిబంధన పెట్టారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత సర్టిఫికేట్, రెండవ సంవత్సరంలో డిప్లొమా... అదేవిధంగా డిగ్రీ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత ఇస్తారు. విద్యార్థులు ఎప్పుడైనా కోర్సును విడిచిపెట్టవచ్చు, ఎప్పుడైనా తిరిగి చేరవచ్చు.

Tags:    

Similar News