నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. తెలుగు తెలిస్తే చాలు బ్యాంకు ఉద్యోగం..!

SBI Clerk Recruitment 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2022-09-13 06:01 GMT

నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. తెలుగు తెలిస్తే చాలు బ్యాంకు ఉద్యోగం..!

SBI Clerk Recruitment 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. అర్హులైన అభ్యర్థులు https://www.sbi.co.in/careers సందర్శించి అప్లై చేసుకోవచ్చు. చివరి తేది 27 సెప్టెంబర్ 2022గా నిర్ణయించారు. నవంబర్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. నిరుద్యోగులకి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు.

అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, బెంగాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కేరళ, లక్నో/ఢిల్లీ, మహారాష్ట్ర/ముంబై మెట్రో, మహారాష్ట్ర, ఈశాన్య ప్రాంతాలలో ఉన్న SBI బ్యాంకుల్లో 5008 పోస్టులను బ్యాంక్ భర్తీ చేస్తోంది. లక్నో, భోపాల్ తర్వాత మహారాష్ట్రలో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలుగా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ

SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 2022

SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష 2022

SBI క్లర్క్ లాంగ్వేజ్ టెస్ట్ 2022

దరఖాస్తు రుసుము

SC / ST / PwBD / ESM / DESM కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుము చెల్లించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careers కి వెళ్లాలి.

2. ఇక్కడ మీరు 'రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకి దరఖాస్తు చేసుకోండని కనిపిస్తుంది. లింక్‌పై క్లిక్ చేయాలి.

3. దరఖాస్తు ఫారమ్ ఓపెన్‌ అవుతుంది. ఫారమ్‌ను పూర్తిగా నింపాలి.

4. అప్లికేషన్ నింపిన తర్వాత డేటాను సమర్పించాలి.

5. వివరాల సరైనవని నిర్ధారించుకున్న తర్వాత స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న సూచనలను అనుసరించి అప్లికేషన్‌తో పాటు చెల్లింపు గేట్‌వే ద్వారా రుసుమును చెల్లించాలి.

6. తర్వాత ఫారమ్‌ను సమర్పించి దాని నుంచి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Tags:    

Similar News