తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో hmtv దశ-దిశ కార్యక్రమంపై ప్రశ్న..

hmtv Dasha-Disha: తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ A.E.E. ఎగ్జామ్‌లో hmtv బ్రాండ్ ప్రొగ్రామ్‌పై ఓ ప్రశ్న ఇచ్చారు.

Update: 2023-01-23 10:55 GMT

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో hmtv దశ-దిశ కార్యక్రమంపై ప్రశ్న..

hmtv Dasha-Disha: తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ A.E.E. ఎగ్జామ్‌లో hmtv బ్రాండ్ ప్రొగ్రామ్‌పై ఓ ప్రశ్న ఇచ్చారు. అభ్యర్థుల కోసం తయారు చేసిన ప్రశ్నపత్రంలో తెలంగాణ ఉద్యమంలో hmtv నిర్వహించిన పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన ప్రశ్నను అడిగారు. ఆంధ్రప్రదేశ్‌ దశ దిశ కార్యక్రమం నిర్వహించిన టీవీ ఛానల్ ఏది అనేదే ఆ ప్రశ్న. తెలంగాణ ఉద్యమ సమయంలో hmtv నిర్వహించిన దశ దిశ కార్యక్రమం తెలుగు ప్రజలందరినీ విపరీతంగా ఆకర్షించింది. ప్రతి వీకెండ్‌లో ప్రసారమయ్యే దశ దిశ లైవ్ డిబేట్ కోసం ప్రజలంతా టీవీల ముందు కూర్చునే వారంటే అతిశయోక్తి కాదు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై లోతైన అధ్యయనం చేసి సమస్యలకు పరిష్కార మార్గం చూపింది దశ దిశ కార్యక్రమం.

ఆనాడు ఉన్న సున్నితమైన సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకున్న hmtv ప్రజల మధ్య సంబంధాలను, భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండేలా నిర్మాణాత్మకమైన పాత్రను పోషించింది. ఆ రోజుల్లో దశ దిశ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోని నాయకత్వం నుంచి కొత్తతరం పుట్టుకొచ్చింది. మొదట నుంచి మీడియా రంగంలో hmtvకి సముచిత స్థానం ఉంది. ప్రజా సమస్యలే అజెండాగా ప్రజల ఇబ్బందులను వెలుగలోకి తీసుకువచ్చేందుకు నిత్యం ప్రయత్నిస్తుంది.. ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా TSPSC నిర్వహించిన అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ A.E.E. పరీక్షలో దశ దిశ గురించి అడగడంతో.. hmtv బ్రాండ్ ప్రొగ్రామ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆనాడు hmtv నిర్వహించిన గురుతరమైన బాధ్యతను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు చెప్పుకోవడం విశేషం.



 

Tags:    

Similar News