ఇంజనీరింగ్‌ విద్యార్థులకి బంపర్ ఆఫర్.. NTPCలో ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు..!

NTPC Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి.

Update: 2022-10-28 12:02 GMT

ఇంజనీరింగ్‌ విద్యార్థులకి బంపర్ ఆఫర్.. NTPCలో ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు..!

NTPC Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 864 ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకి వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, మైనింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పాస్‌ అయి ఉండాలి. దీంతో పాటు గేట్‌-2022లో వ్యాలిడ్‌ ర్యాంక్‌ సాధించాలి. అభ్యర్ధుల వయసు 27 యేళ్లకు మించకూడదు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఇస్తారు. అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు.

జనరల్‌ అభ్యర్ధులు రూ.300 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. గేట్‌ 2022 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు సాలరీ చెల్లిస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు 280, మెకానికల్ ఇంనీరింగ్ పోస్టులు 360, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు 164, సివిల్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు 30,మైనింగ్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు 30 ఖాళీలు ఉన్నాయి. మరిన్ని విషయాలకి అధికారిక నోటిఫికేషన్ పరిశీలించండి.

Tags:    

Similar News