పదో తరగతి చదివినవారికి శుభవార్త.. ఇండియా పోస్ట్‌లో 98083 ఉద్యోగాలు..!

India Post Recruitment 2023: పదో తరగతి చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి.

Update: 2023-01-19 09:23 GMT

పదో తరగతి చదివినవారికి శుభవార్త.. ఇండియా పోస్ట్‌లో 98083 ఉద్యోగాలు..!

India Post Recruitment 2023: పదో తరగతి చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ మొత్తం 98083 ఖాళీలను ప్రకటించింది. ఇండియా పోస్ట్ తన అధికారిక వెబ్ పోర్టల్ indiapost.gov.inలో ఈ ప్రకటన చేసింది. మొత్తం 98083 ఖాళీలలో పోస్ట్‌మ్యాన్ 59099, మెయిల్ గార్డు 1445 ఖాళీలు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ పోస్టుల కోసం 23 సర్కిళ్లలో మొత్తం 37539 ఖాళీలు ఉన్నాయి.

అర్హత

అధికారిక ఇండియా పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ 2023 ప్రకారం.. 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత ప్రమాణాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ తనిఖీ చేయండి.

ఎలా దరఖాస్తు చేయాలి..?

భారతీయ పోస్టల్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ, చివరి తేదీకి సంబంధించి భారతీయ పోస్టల్ శాఖ త్వరలో సమాచారం అందిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలుగా నిర్ణయించారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ

1. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.inని సందర్శించాలి.

2. ఇప్పుడు హోమ్‌పేజీలో 'ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023' లింక్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

3. తర్వాత మీ ముందు ఒక న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ 'రిజిస్టర్ నౌ'పై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు మీ ముందు కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పేరు నమోదు చేసుకోవాలి.

5. రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థులు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

6. వివరాలను పూరించి, పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, దరఖాస్తు రుసుము చెల్లించాలి.

7. ఫీజు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సమర్పించాలి. దాని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Tags:    

Similar News