ఎల్ఐసీలో 9394 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో రూ.50,000 జీతం పొందవచ్చు..!

LIC ADO Jobs 2023: లైఫ్ ఇన్స్యూరెన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజైంది.

Update: 2023-01-27 08:22 GMT

ఎల్ఐసీలో 9394 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో రూ.50,000 జీతం పొందవచ్చు..!

LIC ADO Jobs 2023: లైఫ్ ఇన్స్యూరెన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజైంది. 9,394 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏడీఏ) ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్ కేంద్రంగా వివిధ డివిజనల్ ఆఫీసుల్లో పనిచేసేందుకు 1,408 ఏడీఏ పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టులకి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 పైనే వేతనం ఉంటుంది. ఈ రిక్రూట్‌ మెంట్‌ గురించి ఇతర విషయాలు తెలుసుకుందాం.

ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాస్‌ అయి ఉండాలి. వయసు 21 ఏళ్లకు పైబడి 30 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్థులు 02.01.1993 తర్వాత 01.01.2002లోపు పుట్టిన వారై ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎల్ఐసీ ఎంప్లాయీమెంబర్, ఎక్స్ సర్వీస్ మెన్ లకు వయో పరిమితి ఉంటుంది. అప్లై చేయడానికి ఫీజు ఎస్సీ/ఎస్టీలకు రూ. 100, మిగిలిన వారికి రూ. 750గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకి ఒక సంవత్సరం ప్రోబేషన్ పిరియడ్ ఉంటుంది.

ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా నార్త్, నార్త్ సెంట్రల్, సెంట్రల్, ఈస్ట్, సౌత్ సెంట్రల్, సౌత్ వెస్ట్రన్, ఈస్ట్ సెంట్రల్‌తో సహా మొత్తం ఎనిమిది జోన్‌ల PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కడప , మచిలీపట్నం, నెల్లూరు , రాజమండ్రి , విశాఖపట్నం జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ డివిజన్ల పరిధిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జోన్ల వారీగా ఖాళీలు

తూర్పు జోనల్ కార్యాలయం (కోల్‌కతా) – 1049

వెస్ట్రన్ జోనల్ ఆఫీస్ (ముంబై) – 1942

ఉత్తర జోనల్ కార్యాలయం (న్యూ ఢిల్లీ) – 1216

ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పాట్నా) – 669

నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్)- 1033

దక్షిణ జోనల్ కార్యాలయం (చెన్నై) – 1516

సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్)- 1408

సెంట్రల్ జోనల్ ఆఫీస్(భోపాల్)- 561

Tags:    

Similar News