నిరుద్యోగులకి అలర్ట్‌.. టీచర్‌ జాబ్‌ చేయాలనుకునేవారికి సువర్ణవకాశం..!

KVS Notification 2022: టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్తనే చెప్పాలి.

Update: 2022-12-06 14:30 GMT

నిరుద్యోగులకి అలర్ట్‌.. టీచర్‌ జాబ్‌ చేయాలనుకునేవారికి సువర్ణవకాశం..!

KVS Notification 2022: టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్తనే చెప్పాలి. కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS)రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 5, 2022 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.inని సందర్శించి TGT, PGT, PRT ఇతర టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 13,404 ఖాళీలని భర్తీ చేస్తారు. డిసెంబర్ 26, 2022 చివరితేదీగా నిర్ణయించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షలో 180 మార్కులకు మొత్తం 180 ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌ను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 3 గంటల సమయం ఉంటుంది. అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగ ఎంపిక తర్వాత మొదటి పోస్టింగ్‌లో భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

ఈ నియామక ప్రక్రియ ద్వారా, లైబ్రేరియన్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO),సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (UDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (LDC), హిందీ ట్రాన్స్‌లేటర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-IIతో సహా నాన్-టీచింగ్ పోస్టులని భర్తీ చేస్తారు. వయోపరిమితి గురించి మాట్లాడితే PGTకి గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. TGT/ లైబ్రేరియన్‌కు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు, PRTకి గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము గురించి మాట్లాడితే UR / OBC / EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. SC / ST / PWD అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో ఫీజు చెల్లించాలి.

Tags:    

Similar News