India Post Recruitment 2023: 30 వేల పోస్టులకు భారీ నోటిఫికేషన్‌.. పది పాసైన వారికి సువర్ణవకాశం.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం..!

India Post Recruitment 2023: పదో తరగతి పాసైన వారికి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే పోస్టాఫీసు నుంచి 30,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

Update: 2023-08-03 12:30 GMT

India Post Recruitment 2023: 30 వేల పోస్టులకు భారీ నోటిఫికేషన్‌.. పది పాసైన వారికి సువర్ణవకాశం.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం..!

India Post Recruitment 2023: పదో తరగతి పాసైన వారికి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే పోస్టాఫీసు నుంచి 30,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇప్పటికే ఈ సంత్సరంలో ఇది మూడో నోటిఫికేషన్. మొదటి నోటిఫికేషన్‌లో 40,000, రెండో నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా 12,000, ఇప్పుడు మూడో నోటిఫికేషన్‌లో మరో 30,000 ఉద్యోగాలని భర్తీ చేయనుంది. భారతదేశంలోని పోస్ట్ ఆఫీస్ (BO) కింద బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/ డాక్ సేవక్ పోస్టులని భర్తీ చేయనుంది.

అర్హత గల అభ్యర్థులు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in ద్వారా 03 ఆగస్టు నుంచి 23 ఆగస్టు 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌ను నింపి అవసరమైన పత్రాలను సమర్పించాలి. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. GDS పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులను 10వ తరగతి మార్కుల పర్సంటేజీ ఆధారంగా నియమిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు రూ.12,000/ నుంచి రూ.24,470 మధ్య వేతనం పొందుతారు.

ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుమును చెల్లించాలి. అదే సమయంలో SC / ST / PWD కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. ఇండియా పోస్ట్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. 10వ తరగతి (SSC) లేదా తత్సమానంలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను సిద్దం చేస్తుంది. మెరిట్ లిస్ట్ నుంచి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఈ దశలో అభ్యర్థులు తమ అర్హతను ధృవీకరించడానికి అసలు పత్రాలను సమర్పించాలి. మొత్తం 30,041 పోస్టులకు గాను ఏపీలో 1058, తెలంగాణలో 961 చొప్పున భర్తీ చేస్తారు.

Tags:    

Similar News