నిరుద్యోగులకి అలర్ట్‌.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగాలకి అప్లై చేశారా..!

IAF Recruitment 2022: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్ని వీర్‌వాయు జనవరి 2023 బ్యాచ్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

Update: 2022-11-10 08:26 GMT

నిరుద్యోగులకి అలర్ట్‌.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగాలకి అప్లై చేశారా..!

IAF Recruitment 2022: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్ని వీర్‌వాయు జనవరి 2023 బ్యాచ్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు IAF రిక్రూట్‌మెంట్ వెబ్ పోర్టల్ https://agnipathvayu.cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హులైన అభ్యర్థులకి జనవరి 2023 మధ్యలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.inలో రిక్రూట్‌మెంట్ లింక్ యాక్టివేట్ చేశారు.

వయస్సు ప్రమాణాలు

1. మీరు ఇండియన్‌ పౌరులైతే 29 డిసెంబర్ 1999 నుంచి 29 జూన్ 2005 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).

2. మీరు భారతీయ వైమానిక దళానికి చెందిన NC(E)కి చెందినవారు అయితే పుట్టిన తేదీ క్రింది విధంగా ఉంటుంది.

(A) వివాహిత NC (E) 29 డిసెంబర్ 1993 నుంచి 29 డిసెంబర్ 2000 వరకు (రెండు తేదీలు కలుపుకొని)

(B) అవివాహిత NC (E) 29 డిసెంబర్ 1993 నుంచి 29 జూన్ 2005 వరకు (రెండు తేదీలు కలుపుకొని)

విద్యా అర్హత

బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) వెబ్‌సైట్‌లో సభ్యులుగా జాబితా అయిన బోర్డ్/ఇన్‌స్టిట్యూషన్ నుంచి 10+2 తరగతి/ఇంటర్మీడియట్/తత్సమాన పరీక్షలో ఫిజిక్స్/మ్యాథ్స్/ఇంగ్లీష్‌తో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 10+2 తరగతి/ఇంటర్మీడియట్/తత్సమాన పరీక్ష మార్కు షీట్ ప్రకారం ఆంగ్లంలో 50% మార్కులు సాధించి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. అభ్యర్థులు ముందుగా IAF అగ్నిపత్ రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ను . agnipathvayu.cdac.in.సందర్శించాలి.

2. హోమ్‌పేజీలో అగ్ని వీర్‌ వాయు 2023 రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు మీ పేరు, ఈమెయిల్ చిరునామా, పుట్టిన తేదీ, అభ్యర్థించిన ఇతర సమాచారం నమోదు చేయాలి.

4. ఇప్పుడు మీ దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

5. దరఖాస్తు రుసుము ఏదైనా ఉంటే చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.

6. పూర్తి చేసిన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయాలి. భవిష్యత్తు సూచన కోసం ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.

Tags:    

Similar News