Delhi HC Jobs 2023: ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ చదివినవారు అర్హులు..!

Delhi HC Jobs 2023: ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి.

Update: 2023-03-08 13:30 GMT

Delhi HC Jobs 2023: ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ చదివినవారు అర్హులు..!

Delhi HC Jobs 2023: ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. పర్సనల్ అసిస్టెంట్ సహా పలు పోస్టుల భర్తీకి ఢిల్లీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 127 పోస్టులని భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ delhihighcourt.nic.inని సందర్శించాల్సి ఉంటుంది. చివరితేది మార్చి 31, 2023 వరకు నిర్ణయించారు.

ఖాళీల వివరాలు

ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం 127 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 60 సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, 67 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులు 7వ CPC కింద జీతం పొందుతారు. దరఖాస్తు ప్రక్రియ ఫీజు డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే పూర్తవుతుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఫీజుగా రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు రూ.800గా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ delhihighcourt.nic.inకి వెళ్లాలి.

2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో నోటీసు బోర్డు లింక్‌పై క్లిక్ చేయాలి.

3. తర్వాత సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ – 2023 అప్లై లింక్‌పై క్లిక్ చేయాలి.

4. ఇందులో ఆన్‌లైన్ అప్లికేషన్ ఆప్షన్‌కు వెళ్లాలి.

5. తదుపరి పేజీలో అడిగిన వివరాలని నమోదు చేయాలి.

6. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను నింపవచ్చు.

7. అప్లికేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి.

Tags:    

Similar News