Telangana Jobs 2022: నిరుద్యోగులకి మరో ఆఫర్.. కోర్టుల్లో 4600 పోస్టులు..!
Telangana Jobs 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Telangana Jobs 2022: నిరుద్యోగులకి మరో ఆఫర్.. కోర్టుల్లో 4600 పోస్టులు..!
Telangana Jobs 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కేబినెట్‌లో ప్రకటించిన 80 వేల ఉద్యోగాలే లక్ష్యంగా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. దాదాపు అన్ని శాఖలలోని ఖాళీలని భర్తీ చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే పోలీసు, గ్రూప్ 1,4, జూనియర్ లెక్చరర్ తదితర నోటిఫికేషన్లని విడుదల చేసింది. త్వరలో గ్రూప్ 2,3 నోటిఫికేషన్లు కూడా రానున్నాయి.
అయితే తాజాగా మరో 4500 ఉద్యోగాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయడానికి రెడీ అయింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు తాజాగా అనుమతి లభించినట్లైంది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
ఇదికాకుండా తెలంగాణ పోలీసు, బీసీ సంక్షేమ, రోడ్లు భవనాల శాఖల్లో కలిపి మొత్తం 7,029 కొత్త నియామకాలకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకి రానున్న రోజుల్లో నోటిఫికేషన్లు విడుదలవుతాయి. నిరుద్యోగులు ఈ ఉద్యోగాలని గమనించి వారి ప్రిపరేషన్ కొనసాగిస్తే కచ్చితంగా కొలువు ఖాయమవుతుంది.