Wollongong University: భారత్‌లో ఆస్ట్రేలియా యూనివర్సిటీ.. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు..!

Wollongong University: గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఈ ఏడాది చివరినాటికి వోలాంగాంగ్ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభం కానుందని ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్ తెలిపారు .

Update: 2023-03-04 02:30 GMT

Wollongong University: భారత్‌లో ఆస్ట్రేలియా యూనివర్సిటీ.. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు..!

Wollongong University: గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఈ ఏడాది చివరినాటికి వోలాంగాంగ్ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభం కానుందని ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్ తెలిపారు . ఈ ఏడాది నుంచి మొదటి బ్యాచ్‌ విద్యార్థులు కూడా ప్రవేశాలు పొందనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజుల భారత్ పర్యటన సందర్బంగా ఈ విషయాలు వెల్లడించారు. ఆరంభంలో క్యాంపస్ చిన్నగా ఉంటుందని, మొదట ఫైనాన్స్, STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కోర్సులను ఆఫర్ చేస్తుందని వివరించారు.

గిఫ్ట్‌ సిటీతో పాటు భారతదేశంలో క్యాంపస్‌లను తెరవాలనే ఆస్ట్రేలియా ప్రణాళికల గురించి అడిగిన ప్రశ్నకు క్లైర్ ఈ విధంగా సమాధానం చెప్పారు. భారతదేశంలో ఉమ్మడి క్యాంపస్‌ను తెరవడానికి మూడు లేదా నాలుగు ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలు కలిసి రావచ్చు. కొన్ని విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ప్రత్యేక క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి బదులుగా ఇప్పటికే ఉన్న విశ్వవిద్యాలయం లేదా ఇన్‌స్టిట్యూట్‌లకి సహకరించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

అయితే డీకిన్ యూనివర్శిటీ క్యాంపస్ ప్రారంభం గురించి ఏ విషయాలు చెప్పలేదు. వచ్చే వారం ప్రధాని ఆస్ట్రేలియా పర్యటనలో మరింత సమాచారం ఉంటుందని అందరు ఆశిస్తున్నారు. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో డీకిన్ యూనివర్సిటీ 266వ స్థానంలో ఉంది. భారతదేశంలోని చాలా మంది విద్యార్థులు ఇందులో చదువుకోవడానికి వెళతారు. ఈ ర్యాంకింగ్‌లో వోలాంగాంగ్ 185వ స్థానంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో క్యాంపస్‌ను ప్రారంభించిన మొదటి విదేశీ సంస్థ.

గిఫ్ట్‌ సిటీ అంటే ఏమిటి?

గాంధీనగర్ గిఫ్ట్‌ సిటీ భారతదేశంలో మొట్టమొదటిగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక, సమాచార సాంకేతిక సేవల కేంద్రంగా ఉంది. ఆర్థిక సేవల రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఇక్కడ ఓపెన్ వరల్డ్ లెవల్ ఫారిన్ యూనివర్శిటీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తుందని గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా రిజిస్ట్రేషన్ మంజూరవుతుంది. రెండు ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలు, వోలాంగాంగ్, డీకిన్, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో తమ క్యాంపస్‌లను ప్రారంభించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

Tags:    

Similar News