Career Tips: విద్యార్థులకి అలర్ట్‌.. కెరీర్‌ విషయంలో ఈ తప్పులు చేయవద్దు..!

Career Tips: జీవితంలో విజయం సాధించాలంటే కెరీర్‌లో చాలా విషయాలపై శ్రద్ధ వహించాలి.

Update: 2022-12-24 12:30 GMT

Career Tips: విద్యార్థులకి అలర్ట్‌.. కెరీర్‌ విషయంలో ఈ తప్పులు చేయవద్దు..!

Career Tips: జీవితంలో విజయం సాధించాలంటే కెరీర్‌లో చాలా విషయాలపై శ్రద్ధ వహించాలి. ఒక్కోసారి మల్టీ టాలెంటెడ్‌ వ్యక్తులు కూడా కెరీర్‌ని పాడు చేసుకుంటారు. మీరు కూడా కెరీర్‌లో విజయం సాధించాలంటే, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి. కెరీర్ ప్లానింగ్ సమయంలో విద్యార్థులు చాలా సార్లు ఇతరుల సలహాపైనే వెళతారు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

నిన్ను నువ్వు నమ్ము

పిల్లలు ఏదైనా సబ్జెక్టును ఎంచుకోవలసి వచ్చినప్పుడు లేదా కోర్సు చేయవలసి వచ్చినప్పుడు తమ స్నేహితులు, తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల కోరిక మేరకు అందులో చేరుతారు. తర్వాత పశ్చాత్తాపపడతారు. ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకునేటప్పుడు లేదా కోర్సు చేయాలన్నప్పుడు ముందుగా మీ సామర్థ్యాన్ని గురించి తెలుసుకోవాలి. ఆసక్తికి అనుగుణంగా కెరీర్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి.

ప్రాధాన్యతకి ఓటు

మీరు మీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకోవడం ముఖ్యం. కొంతమంది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం పాటుపడుతారు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కానప్పుడు నిరుత్సాహపడుకుండా మరొక ఎంపికను సిద్ధంగా ఉంచుకోవాలి. మల్టీ టాలెంటెడ్‌ వ్యక్తులుగా మారాలి.

గందరగోళం

కెరీర్ నిర్ణయంలో చాలామంది గందరగోళానికి గురవుతారు. ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి తప్పనిసరిగా సలహా తీసుకోవాలి ఈ వ్యక్తులతో మాట్లాడినట్లయితే వివిధ రంగాల గురించి తెలుసుకుంటారు. మీ ఆసక్తికి అనుగుణంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకోగలరు. జీతం, ఇతర ప్రయోజనాలని ఆశించి వృత్తిని సెట్‌ చేసుకోకూడదు. మీకు  నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకొని పనిచేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News