అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ మారింది.. పూర్తి ప్రక్రియని తెలుసుకోండి..!

Agniveer Recruitment Process: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మార్పులు చేసింది.

Update: 2023-02-04 11:00 GMT

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ మారింది.. పూర్తి ప్రక్రియని తెలుసుకోండి..!

Agniveer Recruitment Process: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మార్పులు చేసింది. ఇప్పుడు సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులు ముందుగా నామినేట్ చేసిన కేంద్రాలలో ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ)కి హాజరు కావాలి. తర్వాత రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు. ఉద్యోగ ఎంపికకు ముందు మెడికల్ టెస్ట్ చేస్తారు. ఇందుకు సంబంధించి భారత సైన్యం ప్రకటన కూడా జారీ చేసింది. ఇందులో సైన్యంలో చేరడానికి మూడు దశల గురించి వివరించింది.

మీడియా నివేదికల ప్రకారం అంతకుముందు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా భిన్నంగా ఉండేది. అభ్యర్థులు మొదట ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టుకి హాజరుకావాలి. తర్వాత మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి. చివరగా అభ్యర్థులు CEEకి అర్హత సాధించాలి. ఇప్పటి వరకు 19000 మంది అగ్నివీరులు సైన్యంలో చేరారు. మార్చి మొదటి వారంలో 21,000 మంది అగ్నివీరులు సైన్యంలో చేరనున్నారు.

రిక్రూట్‌మెంట్ ర్యాలీలలో పాల్గొనే అభ్యర్థుల సంఖ్య చిన్న పట్టణాల్లో 5,000 నుంచి పెద్ద నగరాల్లో 1.5 లక్షల వరకు ఉంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు వేలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నందున రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఒక అధికారి ఇలా అన్నారు "మునుపటి ప్రక్రియ ద్వారా ఖర్చు భారీగా అవుతుంది. ఇది పరిపాలనా వనరులపై ఒత్తిడి తెచ్చింది.

శాంతిభద్రతల పరిస్థితిని ఎదుర్కోవడానికి ర్యాలీలకు పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది, తగినంత వైద్య సిబ్బందిని అవసరమయ్యేది. కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వల్ల ర్యాలీల నిర్వహణ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్,లాజిస్టిక్ భారం కూడా తగ్గుతుంది. ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, భవిష్యత్తులో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మరో అధికారి తెలిపారు.

Tags:    

Similar News