After 10th Short Term Courses: పదో తరగతి తర్వాత ఈ షార్ట్‌టర్మ్‌ కోర్సులు బెస్ట్‌.. ఏడాదికి రూ.5 నుంచి రూ.6 లక్షల సంపాదన..!

After 10th Short Term Courses: కొంతమంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పదో తరగతి పూర్తవ్వగానే చదువు మానేస్తారు. ఇలాంటి వారు షార్ట్‌ టర్మ్‌ కోర్సులు చేసి కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగవచ్చు.

Update: 2024-01-27 15:30 GMT

After 10th Short Term Courses: పదో తరగతి తర్వాత ఈ షార్ట్‌టర్మ్‌ కోర్సులు బెస్ట్‌.. ఏడాదికి రూ.5 నుంచి రూ.6 లక్షల సంపాదన..!

After 10th Short Term Courses: కొంతమంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పదో తరగతి పూర్తవ్వగానే చదువు మానేస్తారు. ఇలాంటి వారు షార్ట్‌ టర్మ్‌ కోర్సులు చేసి కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. అలాంటి కోర్సులో ఈ రోజుల్లో మార్కెట్‌లో చాలా ఉన్నాయి. కార్పొరేట్‌ రంగంలో వీరికి ఎల్లప్పుడు డిమాండ్‌ ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.35 నుంచి 40 వేల వరకు సంపాదించవచ్చు. ఈరోజు అలాంటి కొన్ని ట్రెండింగ్ షార్ట్ టర్మ్ కోర్సుల గురించి తెలుసుకుందాం.

1. స్టెనోగ్రఫీలో డిప్లొమా

ఈ రోజుల్లో అత్యంత ట్రెండింగ్‌లో ఉన్న షార్ట్‌టర్మ్ కోర్సు డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ. ఈ కోర్సులో స్టెనోగ్రఫీతో పాటు కంప్యూటర్, టైపింగ్ కూడా నేర్పిస్తారు. స్టెనోగ్రఫీ నేర్చుకోవడం ద్వారా మీరు సులభంగా ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. ఇది కాకుండా ఏదైనా బహుళజాతి కంపెనీలో (MNC) నెలకు రూ. 30 నుంచి రూ. 35 వేలు సంపాదించవచ్చు.

2. ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా

మీకు ఆర్ట్ & క్రాఫ్ట్‌పై కొంచెం ఆసక్తి ఉంటే ఫైన్ ఆర్ట్స్ రంగంలో డిప్లొమా పొందడం ద్వారా గొప్ప కెరీర్ వైపు వెళ్లవచ్చు. 10వ తరగతి ఆధారంగా 6 నెలల నుంచి ఒక సంవత్సరం కాలానికి డిప్లొమా కోర్సు ఉంటుంది. ఈ కోర్సు చేసిన తర్వాత గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్, ఫ్లాష్ యానిమేటర్, ఆర్ట్ లైజన్ ఆఫీసర్ వంటి పోస్టుల్లో ఉద్యోగం సాధించి నెలకు రూ.50 వేలకు పైగా జీతం పొందవచ్చు.

3. డిప్లొమా ఇన్ మల్టీమీడియా

నేటి కాలంలో ప్రతి మూడో వ్యక్తి సోషల్ మీడియాలో వీడియోలు క్రియేట్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. దీంతో పాటు మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ వీడియో సృష్టికర్తలకు వారి వీడియోలను సవరించడానికి వీడియో ఎడిటర్, యానిమేటర్, గ్రాఫిక్ డిజైనర్ అవసరం. 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ రంగంలో కెరీర్‌ను కొనసాగించవచ్చు. ఇందుకోసం మల్టీమీడియాలో డిప్లొమాలో ఇన్‌ షార్ట్ టర్మ్ కోర్సు చేయడం ద్వారా వీడియో ఎడిటర్, యానిమేటర్, గ్రాఫిక్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.

4. డిప్లొమా ఇన్ ఆర్ట్ టీచర్

మీరు ఆర్ట్ టీచర్ కావాలంటే కళ, క్రాఫ్ట్ పట్ల ఆసక్తి ఉండాలి. దీని కోసం 6-నెలల స్వల్పకాలిక కోర్సు చేయాలి. తర్వాత ఈ రంగంలో కెరీర్‌ను చేయగలుగుతారు. వాస్తవానికి ఈ కోర్సులో విద్యార్థులకు బోధనా పద్ధతులను బోధిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ కోర్సు మంచి ఎంపిక. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ కోర్సుకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కోర్సు చేయడం ద్వారా నెలకు రూ. 30 నుంచి రూ. 35 వేల వరకు సంపాదించవచ్చు.

Tags:    

Similar News