ఒక్కడే దొంగ : 130 బైకులు... అన్ని హీరో హోండాలే

Update: 2019-09-12 11:20 GMT

అతనో దొంగ ... దొంగతనంలో అతనికో స్పెషాలిటి ఉంది . అన్ని బైకులే దొంగతనాలు చేస్తాడు . మళ్ళీ అందులో అన్ని హీరో హోండాలే.. ఇలా వరుసగా దొంగతనాలు చేస్తూ విశాఖ పోలీసులకు సవాల్ గా మారాడు. ఈ క్రమంలో పోలీసులు పక్కా స్కెచ్ వేసి మరి అతన్ని పట్టుకున్నారు. అతడిని వీరయ్య చౌదరి అనే వ్యక్తిగా గుర్తించారు . అతను ఏకంగా 130 బైకులను దొంగిలించినట్టు పోలిసుల విచారణలో తేలింది .అందులో అన్ని హీరో హోండాకి చెందినా బైకులే కావడంతో పోలీసులు షాక్ అయ్యారు . ఇక అతను దొంగాతానం చేసిన బైకులను రికవరీ చేసిన పోలీసులు వాటిని ఓ మైదానంలో ప్రదర్శనకు పెట్టాల్సి వచ్చింది. 

Tags:    

Similar News