విజయవాడలో కీచకుడు జగదీష్‌ అరెస్ట్‌

Update: 2019-08-26 15:25 GMT

కీచకుడు జగదీష్‌ను విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రేమపేరుతో మైనర్ బాలికలను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు కీచకుడు జగదీష్. బాలికల నగ్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేశాడు. సంపన్నవర్గానికి చెందిన బాలికలనే టార్గెట్‌గా చేసుకుని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఈ దారుణాలపై మాచవరంలో కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

ప్రేమ పేరుతో మైనర్లను లొంగదీసుకొని, ఆపై అత్యాచారం చేసి, వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేయడం జగదీష్‌ హాబీ. ఇందుకు ముగ్గురు స్నేహితుల సహకారం కూడా తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో ఇప్పటివరుకు ఆరుగురు మైనర్ బాలికలు జగదీష్‌ మోసగించాడు. ఒక్కరోజు వ్యవధిలో మైనర్ బాలిక తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జగదీష్ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

19 ఏళ్ల జగదీష్‌ లీలలు చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. కీచకుడిపై అత్యాచారం, కిడ్నాప్‌, మోసం, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, దౌర్జన్యం కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే నాలుగు రోజుల క్రితం తమ కుమారుడు కనిపించడం లేదని జగదీష్‌ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

Similar News