టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య...ప్రేమే కారణమా..?

Update: 2019-02-06 05:59 GMT

హైదరాబాద్‌‌లో టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. శ్రీనగర్‌కాలనీలోని ఇంట్లో ఇంట్లో ఫ్యాన్‌‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఝాన్సీ స్వస్థలం కృష్ణాజిల్లా ముద్దెనపల్లి మండలం వాడాలి గ్రామంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఝాన్సీ సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు.

ఆత్మహత్యకు ముందు బాయ్‌ఫ్రెండ్ సూర్యతో ఝాన్సీ వాట్సప్ చాట్‌ చేసినట్లు గుర్తించారు. మాటీవీ పవిత్రబంధం సీరియల్‌లో నటించిన ఝాన్సీ 6 నెలలుగా బాయ్‌ఫ్రెండ్ సూర్యతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యతో పరిచయం తర్వాత సీరియల్స్‌‌కి దూరంగా ఉంటోన్న ఝాన్సీ అతను పెళ్లికి నిరాకరించడంతోనే ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు.

సూర్య మోసం చేయడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. 6 నెలలుగా మించుకుంటున్నారని, అయితే సూర్య పెళ్లికి నిరాకరించడంతోనే ఝాన్సీ బలవనర్మణానికి పాల్పడిందని అంటున్నారు. ఒకవైపు సీరియల్స్‌లో అవకాశాలు కోల్పోయి మరోవైపు సూర్య మోసం చేయడంతో కుంగిపోయి ఝూన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Similar News