Serial Killer Arrested: 25 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన టాక్సీ డ్రైవర్ల ఘోరహంతకుడు

దిల్లీ నగరాన్ని భయపెట్టిన ఓ కరడుగట్టిన నేరస్థుడు చివరికి పోలీసుల వలలో చిక్కాడు. 25 సంవత్సరాలుగా పలు గుర్తింపులు మార్చుకుంటూ, అడ్రస్‌లు మార్చుకుంటూ దొరక్కుండా తిరుగుతున్న అజయ్ లాంబా అలియాస్ బన్షీ (49) ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను టాక్సీలను అద్దెకు తీసుకొని, డ్రైవర్లను చంపేసి, వారి మృతదేహాలను అటవీ ప్రాంతాల్లో పడేసేవాడు. అనంతరం వాహనాలను నేపాల్ సరిహద్దులో విక్రయించేవాడు.

Update: 2025-07-06 13:00 GMT

Serial Killer Arrested: 25 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన టాక్సీ డ్రైవర్ల ఘోరహంతకుడు

Serial Killer Arrested: దిల్లీ నగరాన్ని భయపెట్టిన ఓ కరడుగట్టిన నేరస్థుడు చివరికి పోలీసుల వలలో చిక్కాడు. 25 సంవత్సరాలుగా పలు గుర్తింపులు మార్చుకుంటూ, అడ్రస్‌లు మార్చుకుంటూ దొరక్కుండా తిరుగుతున్న అజయ్ లాంబా అలియాస్ బన్షీ (49) ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను టాక్సీలను అద్దెకు తీసుకొని, డ్రైవర్లను చంపేసి, వారి మృతదేహాలను అటవీ ప్రాంతాల్లో పడేసేవాడు. అనంతరం వాహనాలను నేపాల్ సరిహద్దులో విక్రయించేవాడు.

పోలీసుల వివరాల ప్రకారం, అజయ్ 2001లో న్యూఅశోక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో నేరస్థుడిగా ఉన్నాడు. 1999–2001 మధ్య జరిగిన పలు హత్యలు, దోపిడీల్లో అతడు ప్రధాన పాత్రధారి. తర్వాత ఇతడు ధీరేంద్ర, దిలీప్ అనే నిందితులతో కలిసి టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకొని నేరాలు కొనసాగించాడు.

చిన్ననాటి నుంచే నేర బాటలోకి...

1976లో జన్మించిన అజయ్, ఆరో తరగతి వరకు చదివి ఆ తర్వాత నేరాలవైపు అడుగులు వేసాడు. తన అసలు పేరును మార్చుకొని యూపీలోని రాయ్‌బరేలీకి వెళ్లిపోయాడు. అక్కడ కొత్త నకిలీ గుర్తింపుతో నేరాలు సాగించాడు. డ్రైవర్లను హత్య చేసి వారి వాహనాలను నేపాల్ సరిహద్దుల్లో అమ్మడం ఇతని రూటీనే.

డ్రగ్స్ కేసులోనూ అరెస్టు

2008 నుంచి 2018 వరకు అతను నేపాల్‌లో నివసించినట్టు గుర్తించారు. తర్వాత దేహ్రాదూన్‌కు వెళ్లిన అజయ్, 2020 నాటికి డ్రగ్స్ అక్రమ రవాణాలోకి దిగాడు. ఒడిశా నుంచి గంజాయి సరఫరా చేస్తూ దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ కొనసాగించాడు. 2021లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద సాగర్‌పుర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అలాగే 2024లో ఒడిశాలోని బెహ్రంపుర్ నగల దుకాణంలో జరిగిన దోపిడీ కేసులోనూ అతడు అరెస్టయ్యాడు. అయితే రెండు కేసుల్లోనూ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

తాజాగా దిల్లీ క్రైం బ్రాంచ్ ప్రత్యేక ఆపరేషన్‌లో అజయ్ లాంబాను అదుపులోకి తీసుకుంది. అతడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసుల్ని ఉన్నతాధికారులు అభినందించారు.

ఈ అరెస్ట్‌తో దశాబ్దాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.

Tags:    

Similar News