Borabanda: బోరబండలో దారుణ హత్య.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Borabanda: బోరబండ రాజీవ్ గాంధీ నగర్‌లో నిద్రిస్తున్న భార్యను భర్త రోకలి బండతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2026-01-20 06:21 GMT

Borabanda: బోరబండలో దారుణ హత్య.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Borabanda: హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో సోమవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యను భర్త రోకలి బండతో తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం, రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన రొడ్డె సరస్వతి (32) గృహిణి. ఆమె భర్త రొడ్డె అంజనేయులు (43)తో కలిసి నివసిస్తోంది. అంజనేయులు భార్యపై పరాయి సంబంధం ఉందని అనుమానిస్తూ తరచూ గొడవ పడేవాడని సమాచారం. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో భార్యపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటన అనంతరం నిందితుడు అంజనేయులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News