పత్తికొండ ప్రాంతంలో క్షుద్రపూజలు

Update: 2019-08-01 12:11 GMT

కర్నూలు జిల్లా పత్తికొండ ఏరియాలో అమావాస్య వచ్చిందంటే చాలు జనం హడలెత్తుతున్నారు. చౌరస్తాల వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. మూడు రోడ్ల కూడలిలో కుంకుమ, పసుపు, మట్టితో చేసిన వింత ఆకారాలు, నిమ్మకాయలు, కోడి గుడ్లు తదితర వస్తువులు విచ్చలవిడిగా పడివుంటున్నాయి.

పత్తికొండ ప్రాంతంలో ఇప్పటికీ జనం మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఏదైనా వ్యాధి వస్తే డాక్టర్లకు బదులు మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. దెయ్యం పట్టిందని చెబుతున్న కేటుగాళ్లు తాంత్రిక పూజ చేస్తే నయం అవుతుందని నమ్మిస్తున్నారు. అమాయకుల వద్ద వేలాది డబ్బులు వసూలు చేస్తున్నారు. అమావాస్య అర్ధరాత్రి చౌరస్తాలలో క్షుద్ర పూజలు చేస్తున్నారు. రోడ్లపై తీసివేతలు చూసి జనం భయపడుతున్నారు.

కంప్యూటర్ యుగంలోనూ జనం తాంత్రిక పూజలను నమ్మడంపై డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. రోగం వస్తే చికిత్స తీసుకోవాలి తప్ప మంత్రగాళ్లను ఆశ్రయించరాదని కోరుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు, అదే తరహాలో క్షుద్ర పూజలకు వ్యాధులు నయం కావు అన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలంటున్నారు.

Full View

Tags:    

Similar News