Sahasra Murder Case: సహస్ర హత్య కేసులో మైనర్ కస్టడీ – కోర్టు అనుమతి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం రేపిన చిన్నారి సహస్ర హత్య కేసులో మైనర్ నిందుతుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు
సహస్ర హత్య కేసులో మైనర్ కస్టడీ – కోర్టు అనుమతి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన చిన్నారి సహస్ర కేసులో నిందుతుడిని కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో బాలుడుని నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జువైనల్ హోంలోనే విచారించారు పోలీసులు. బాలుడు మొదటి నుంచి చెబుతున్నట్లు క్రికెట్ బ్యాట్ కోసమే సహస్రను హత్య చేసినట్లు మరోసారి అంగీకరించాడు. బాలుడిపై హత్యకేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం నమోదు చేశారు పోలీసులు.