పక్కా ప్లాన్‌తోనే దాడి

Update: 2019-02-07 09:38 GMT

బర్కత్‌పూరా ప్రేమోన్మాది దాడి ఘటనలో ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు భరత్ పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు పోలీసుల నిర్ధారించారు. దాడికి రెండు రోజుల ముందే ఇందుకోసం పథకం రచించినట్టు గుర్తించారు. ఇందుకోసమే బర్కత్‌పురలో కొబ్బరి బోండం కొట్టే కత్తిని అతను దొంగలించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంట్లో ఎవరికి కనిపించకుండా కత్తిని దాచిన ప్రేమోన్మాది భరత్ బాలిక కాలేజ్‌కు వెళుతుండగా కత్తితో వెంబడించి దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన అనంతరం కత్తిని తిరిగి ఇంట్లోనే దాచినట్టు గుర్తించారు.  

Similar News