ఫోన్ పోయిందని ఫోన్ల దొంగతనాలు చేసాడు ... చివరికి

Update: 2019-08-31 15:03 GMT

వరుసగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ గా మారినా నేరస్థుల ముఠాని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు .. ముఠా లోని నేరస్థులు దగ్గర 23 లక్షలు స్వాదినం చేసుకున్నారు . కమిషనరేట్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు . పోలీస్ కమిషనర్ చెప్పిన వివరాల ప్రకారం కాకినాడకి చెందినా ఓ బాలుడు(17) కూలి పనికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న ఫోన్ ని ఎవరో దొంగతనం చేసారు . దీనితో చాలా విరక్తి చెందినా అ బాలుడు ఫోన్ దొంగతనాలకు ఎగబడ్డాడు .. యుట్యుబ్ లో దొంగతనం ఎలా చేయాలో తెలుసుకున్నాడు . ఇలా ఫోన్ల దొంగతనం కాస్తా మరిన్ని దొంగతనాలకు దారి తీసింది . పలుమార్లు దొంగతనం కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చినా అతని వైఖరి మారలేదు .

మరికొందరు సహాయంతో మరిన్ని దొంగతనాలకు అలవాటుపడ్డాడు . ఇందులో హన్మకొండకి చెందినా రంజిత్ (38) , హుస్నాబాద్ కి చెందినా కందారపు సాయి వర్మ(19) , ఎల్వకా సాయిరాం (19), విలసాగారం రజీనికాంత్(19), ముల్కనూర్ కి చెందినా రాజు (26) ఉన్నారు . వీరందరూ ఓ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు . పగలంతా ఇంటికి రెక్కి నిర్వహించి రాత్రి దొంగతనాలకు పాల్పడి అ తర్వాత ఇంట్లో కారంపొడి చల్లి పారిపోతారు . అయితే అ చుట్టుపక్కల ఇలాంటి దొంగతనాలు ఎక్కువ కావడంతో పోలిస్ సిబ్బంది దీనిపైన ప్రత్యేక ద్రుష్టి పెట్టింది . సాంకేతిక పరికరాలతో వారిని పట్టుకొని అరెస్ట్ చేసారు . వారిని పట్టుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎస్సైలకు అభినందనలు తెలిపారు కమిషనర్   

Tags:    

Similar News