జయరాం హత్యకేసులో సంచలన విషయాలు వెల్లడించిన రాకేశ్

Update: 2019-02-04 07:26 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసు మిస్టరీ వీడుతోంది. జయరాం హత్యతో శిఖా చౌదరికి సంబంధం లేదని, ఆర్థిక వ్యవహారాలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో జయరాంను నిర్బంధించి రాకేష్‌రెడ్డి జయరాంను పిడిగుద్దులు గుద్దినట్టు తెలుస్తోంది. హార్ట్ పేషెంట్ కావడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినట్టు నిర్ధారించారు. గత నెల 31వ తేదీ రాత్రి తాగిన మైకంలో జయరాం డెడ్‌బాడీని కారులో నందిగామ తీసుకొచ్చి ప్రమాదంగా చిత్రీకరించి రిటర్న్‌లో రాకేష్ బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

అయితే, మెదక్‌లోని టెక్ట్రాన్ కంపెనీ గొడవ వ్యవహారంలో జయరాంకు రాకేష్‌రెడ్డి పరిచయమైనట్టు తెలుస్తోంది. ఉద్యోగుల గొడవ నేపథ్యంలో 4.5కోట్లు జయరాంకు రాకేష్‌రెడ్డి అప్పుగా ఇచ్చాడు. అదే సమయంలో శిఖాచౌదరితో ఏర్పడిన పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. దీంతో శిఖాను వదిలేయామని జయరాం పట్టుబట్టాడు. తనకు ఇవ్వాల్సిన 4.5కోట్లతో పాటు శిఖాచౌదరికి ఖర్చుపెట్టిన కోటిరూపాయలు ఇచ్చేస్తే వదిలేస్తానని చెప్పాడు. డబ్బులిస్తానని చెప్పి జయరాం హ్యాండివ్వడంతో కక్షపెంచుకున్న రాకేష్‌రెడ్డి గత నెల 31న జయరాం కనిపించడంతో కిడ్నాప్ చేశాడు.

జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో డబ్బుల కోసం జయరాంను బెదిరించడంతో డబ్బులిచ్చేస్తానని స్నేహితుల వద్ద నుంచి రప్పించి 6లక్షలు ఇచ్చాడు. దీంతో 6లక్షలేంటని జయరాంతో వాదనకు దిగి పిడిగుద్దులు గుద్దాడు. దీంతో హార్ట్ స్ట్రోక్‌ వచ్చి జయరాం మృతి చెందాడని పోలీసులు భావిస్తున్నారు.

Full View 

Similar News