హైదరాబాద్ చైన్ స్నాచర్ల అరెస్ట్‌

చైన్‌ స్నాచింగ్‌తో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సంచలనం సృష్టించిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 25 తులాల బంగారు చైన్లను లాక్కున్న బీహార్‌ గ్యాంగ్‌లో నలుగురిని పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు.

Update: 2019-01-03 04:16 GMT
Chain Snatchers

చైన్‌ స్నాచింగ్‌తో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సంచలనం సృష్టించిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 25 తులాల బంగారు చైన్లను లాక్కున్న బీహార్‌ గ్యాంగ్‌లో నలుగురిని పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు అందులో ఇద్దరు హైదరాబాద్‌కు చెందినవారని తెలిపారు.

స్నాచింగ్‌కు పాల్పడే రెండు రోజుల ముందు దుండుగులు మలక్‌పేట్‌లోని ఓ వ్యాపారి దగ్గర కార్‌ను రెంట్‌కు తీసుకుని రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. అదే వ్యాపారి దగ్గర KTM బైక్ రెంట్‌కు తీసుకుని స్నాచింగ్‌కు పాల్పడ్డారు. స్నాచింగ్‌ తర్వాత బైక్‌ను వ్యాపారికి అప్పగించి గ్యాంగ్‌ ఢిల్లీకి పారిపోయింది. బైక్‌ ఆధారంగా కూపీ లాగిన పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు. ఇక దొంగలించిన 25 తులాల బంగారం కోసం ఢిల్లీలో పోలీసులు వెతుకుతున్నారు. ఇటు స్నాచర్లను ఎల్లుండి మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు వెల్లడించారు.

Full View 

Similar News