రోహిత్‌ను చంపింది.. అతని భార్యే: ఢిల్లీ పోలీసులు

Update: 2019-04-25 05:17 GMT

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. రోహిత్‌ను హత్య చేసింది ఆయన భార్య అపూర్వ శుక్లానే అని పోలీసులు నిర్ధారించారు. మూడు రోజుల కస్టడీలో విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. వైవాహిక జీవితంలో గొడవల కారణంగానే ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ నెల 16 న రోహిత్ అనుమానాస్పద రీతిలో మృతిచెందగా రోహిత్‌ది సహజ మరణం కాదని తేలింది. ఈ నెల 15న ఓటు వేయడానికి రోహిత్, ఆయన తల్లి, ఓ బంధువు కలిసి ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు రోహిత్ ఓ మహిళా బంధువుతో కలిసి మద్యం సేవించాడు. ఇదే సమయంలో భార్య అపూర్వ రోహిత్‌కు వీడియో కాల్ చేయగా మహిళతో కలిసి మద్యం తాగడాన్ని గమనించింది. ఇదే అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన ఆమె రోహిత్ ముఖంపై దిండుతో బలంగా నొక్కడంతో ఊపిరి ఆడక మరణించాడని పోలీసులు వెల్లడించారు. అపూర్వ ప్రస్తుతం సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు.  

Similar News