గూగుల్ లింక్ పంపి లక్షలు కొట్టేశారు.. సైబర్ నేరస్తుల్ని అరెస్టు చేసిన పోలీసులు

మరో సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. సెల్‌ఫోన్‌కు గూగుల్ లింక్‌ను పంపి బ్యాంకు ఖాతా వివరాలు అపహరించి ఇ-వ్యాలెట్ యాప్‌ల సహాయంతో 5లక్షల 29వేలు కొట్టేసిన జార్ఖండ్ జమ్ తారా ముఠాకు చెందిన ఐదుగురు సైబర్ నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2019-11-21 04:58 GMT
cyber criminals

మరో సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. సెల్‌ఫోన్‌కు గూగుల్ లింక్‌ను పంపి బ్యాంకు ఖాతా వివరాలు అపహరించి ఇ-వ్యాలెట్ యాప్‌ల సహాయంతో 5లక్షల 29వేలు కొట్టేసిన జార్ఖండ్ జమ్ తారా ముఠాకు చెందిన ఐదుగురు సైబర్ నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు.

గత నెల 21న నగరానికి చెందిన ఓ ప్రముఖ వైద్యురాలి చరవాణికి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలు సమర్పించకపోతే మీ డెబిట్ కార్డు త్వరలోనే స్తంభించిపోతుందంటూ క్యూపీ-SBINBS నుంచి SMS వచ్చింది. అందులో ఉన్న గూగుల్ లింక్‌ను తెరిచి ఖాతా సమాచారం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలు నమోదు చేశారు. మరోసటి రోజు ఖాతా నుంచి 5లక్షల 29వేలు ఇ-వ్యాలెట్ యాప్ ‌లకు బదిలీ అయినట్లు సందేశం వచ్చింది.

జార్ఖండ్‌కు చెందిన జాంతారా ముఠా పని అని గుర్తించిన పోలీసులు అక్కడి వెళ్లారు. ముఠాలో సంజయ్ కుమార్ , రామ్‌కుమార్ మండల్ , జమృద్దీన్ అన్సారీ, జితేంద్ర మండల్, బీరిందర్ కుమార్ మండల్, రోహిత్ రాజ్‌ ‌సభ్యులుగా ఉన్నారు. సైబర్ క్రైం పోలీసుల బృందం ముఠాలోని ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి 2లక్షల 66వేలు, 12 గ్రాముల బంగారం గొలుసు, ఆరు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ మండల్ పరారీలో ఉన్నాడు. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని సీపీ సజ్జనార్ వెల్లడించారు. 

Tags:    

Similar News