Cyber Crime Alert: కాల్ మెర్జింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది? తెలుసుకోకపోతే భారీ నష్టం!

కాల్ మెర్జింగ్ స్కామ్‌లో ఫోన్ మెర్జ్ చేసిన వెంటనే హ్యాకింగ్ జరగవచ్చు. ఈ మోసం ఎలా జరుగుతుందో తప్పకుండా తెలుసుకోండి.

Update: 2025-05-23 15:15 GMT

Cyber Crime Alert: కాల్ మెర్జింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది? తెలుసుకోకపోతే భారీ నష్టం!

Cyber Crime Alert: నేటి డిజిటల్ యుగంలో సైబర్ మోసగాళ్లు ప్రతి రోజు కొత్త కొత్త టెక్నిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. తాజాగా సూరత్‌లోని అంతర్జాతీయ సైబర్ నిపుణులు ఒక భయంకరమైన మోసం గురించి హెచ్చరించారు. అదే ‘కాల్ మెర్జింగ్ స్కామ్’.

ఈ స్కామ్ ప్రత్యేకంగా ఉద్యోగాలు వెతుకుతున్న యువతను లక్ష్యంగా చేసుకుంటుంది. ముందుగా స్కామర్లు ఒక కంపెనీ తరఫున ఉద్యోగం వచ్చిందని సమాచారం ఇస్తారు. అనంతరం మీరు ఒక సీనియర్ హైరింగ్ మేనేజర్‌తో మాట్లాడాల్సిందిగా చెబుతారు. ఆ తర్వాత కాల్‌ను ఇతర ఇద్దరితో మెర్జ్ చేయమని కోరుతారు.

ఇక్కడే అసలు ముప్పు మొదలవుతుంది!

మీరు కాల్ మెర్జ్ చేసిన వెంటనే, స్కామర్‌లకు మీ ఫోన్, వాట్సాప్, లేదా బ్యాంక్ ఖాతాలపై యాక్సెస్ లభించే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారి దగ్గర ఇప్పటికే మీ కొన్ని వ్యక్తిగత వివరాలు ఉండే అవకాశం ఉంది – పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్, వగైరా.

తర్వాతి అడుగు – OTP దొరకడం.

కాల్ ద్వారా స్కామర్‌లు OTP రాబట్టే ప్రయత్నం చేస్తారు. మీరు మాట్లాడుతున్న సమయంలోనే స్కామర్‌లు సంభాషణను వింటూ, అవసరమైన సమాచారం తీసుకుని అకౌంట్‌ హ్యాక్ చేయవచ్చు.

ఇలాంటి మోసాల నుంచి ఎలా కాపాడుకోవాలి?

  • అస్సలు గుర్తు లేని నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ను నమ్మవద్దు.
  • ఎవరూ చెప్పినా, మీరు ట్రిపుల్ కాల్‌కి అనుమతించకండి.
  • OTP, పర్సనల్ డేటా ఎవరితోనూ షేర్ చేయొద్దు.
  • సైబర్ క్రైమ్‌కి సంబంధించి అప్రమత్తంగా ఉండండి.

చివరగా, మోసగాళ్లు టెక్నాలజీని వాడుకుంటున్నా, మన జాగ్రత్తలు వారిని ఓడించగలవు. ఒక చిన్న అప్రమత్తత... పెద్ద నష్టాన్ని నివారించవచ్చు!

Tags:    

Similar News