లైంగిక వేధింపుల కేసు : చిన్మయానంద్‌ అరెస్ట్‌

Update: 2019-09-20 08:04 GMT

23 ఏళ్ల లా విద్యార్థినిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై కేంద్ర మాజీమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు చిన్మయానందను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. చిన్మయానంద లా కాలేజీలో ప్రవేశం కల్పిస్తానని ఆశ పెట్టి తనను ఏడాది పాటు అత్యాచారం చేశాడంటూ విద్యార్థిని కోర్టులో సాక్ష్యం చెప్పింది. 50 మంది పోలీసుల భద్రత మధ్య బాధితురాలైన విద్యార్థిని చీఫ్ జుడిషీయల్ మెజిస్ట్రేట్ ముందు స్టేట్ మెంట్ ఇచ్చింది. తన వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని యువతి కోర్టులో పేర్కొంది.  

Tags:    

Similar News