పుట్టిన రోజునాడే యువతి అనుమానస్పద మృతి

Update: 2019-11-28 07:05 GMT

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. హంటర్ రోడ్డులో పడి ఉన్న యువతి మృతదేహాన్ని కనుగొన్నారు. యువతి దీన్ దయాల్ నగర్ కాలనీకి చెందిన మానసగా గుర్తించారు.

పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన మానస తిరిగి ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మానస స్నేహితుల ఇళ్లలో వెతికారు. రాత్రి పదిగంటల సమయంలో నంది హిల్స్ విష్ణుప్రియ గార్డెన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో యువతి మృతదేహం ఉందని సమాచారం రావడంతో కుటుంబ సబ్యులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న తమ కూతురును చూసి కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు. ఎవరో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News