అయేషా మీరా హత్య కేసులో కదులుతున్న డొంక

అయేషా మీరా హత్య కేసులో అసలు డొంక కదులుతోంది. కేసు విచారణలో అత్యంత కీలకమైన సాక్షాలను ధ్వంసం చేయడంలో కుట్ర కోణం దాగున్నట్టు సీబీఐ గుర్తించింది.

Update: 2019-01-02 07:45 GMT
Ayesha Meera

అయేషా మీరా హత్య కేసులో అసలు డొంక కదులుతోంది. కేసు విచారణలో అత్యంత కీలకమైన సాక్షాలను ధ్వంసం చేయడంలో కుట్ర కోణం దాగున్నట్టు సీబీఐ గుర్తించింది. కేసును విచారించిన మహిళా కోర్టు న్యాయమూర్తికి ఇచ్చిన సమాచారానికి భిన్నంగా ఉత్వర్తులు జారీ అయినట్టు గుర్తించారు. నాన్ వాల్యూబుల్స్ వెనక్కి ఇస్తున్నామంటూ జడ్జీకి సమాచారం ఇచ్చిన కోర్టు సిబ్బంది దీనికి భిన్నంగా సాక్షాలను ధ్వంసం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్టు గుర్తించారు. వీటి ఆధారంగానే అత్యంత కీలకమైన సాక్షాలను ధ్వంసం చేసినట్టు నిగ్గుతేల్చారు. ఈ వ్యవహారంలో కోర్టుకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు . ఏవన్‌గా ప్రాపర్టీ క్లర్క్‌ కుమారి, ఏ2గా సీనియర్ అసిస్టెంట్‌ సుబ్బారెడ్డి ఏ3గా జూనియర్ అసిస్టెంట్‌ వెంకట కుమార్‌లపై కేసు నమోదు చేశారు.  

Similar News