అయేషా మీరా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం

Update: 2019-01-28 07:42 GMT

అయేషా మీరా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నిందితులుగా భావిస్తున్న వ్యక్తులను, అనుమానితులను విచారించిన సీబీఐ హత్య కేసు మూలాలను చేధించే దిశగా విచారణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే గతంలో ఈ కేసును విచారించిన పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించాలని భావిస్తున్నట్టు సమాచారం. కేసులో రాజకీయ కోణాలు వెలుగు చూడటం, హత్య కేసులో అత్యంత కీలకమైన సాక్షాలు ధ్వంసం కావడం యాధృశ్చికంగా జరిగిన ఘటనలు కాదని సీబీఐ భావిస్తోంది. ఈ దిశలో దర్యాప్తు చేసిన పోలీసులను విచారించడం వల్ల కీలకమైన సమాచారాన్ని రాబట్టవచ్చని సీబీఐ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే15 మంది పోలీస్ అధికారుల జాబితాను సీబీఐ సిద్ధం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పాలనపరమైన అనుమతులు రాగానే వీరిని విచారించే అవకాశాలున్నట్టు సమాచారం. 

Similar News