మాజీ భార్యను హతమార్చలనుకున్నా భర్త .. కానీ చివరకి ఇలా ..

Update: 2019-07-13 11:42 GMT

తన మాజీ భార్యని హత మార్చాలని అనుకున్నాడు ఓ మాజీ భర్త కానీ ఈ విషయాన్ని పసిగట్టిన అ భార్య అ ప్రమాదం నుండి తప్పించుకుంది . ఈ సంఘటన రాజేంద్రనగర్ లో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే బోరబండకు చెందినా సాయి కిరణ్ కి మరియు లావణ్యకి గత కొంత కాలం కింద వివాహం అయింది . వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు .. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు .ఈ క్రమంలో లావణ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రాజేంద్ర నగర్ లోని బండ్లగూడలో రూమ్ అద్దెకు తీసుకొని ప్రైవేటుగా జాబు చేసుకుంటూ ఉంది.

అయితే ఇది చూసి తట్టుకోలేని తన మాజీ భర్త సాయి కిరణ్ లావణ్యని ఎలా అయిన హత మార్చాలని ప్లాన్ వేసాడు . అందులో బాగంగానే గత కొద్ది రోజులుగా అక్కడే సంచరిస్తూ ఉన్నాడు . ఈ విషయాన్ని ;లావణ్య గమనించడంతో పోలీసులకు 100 కి కాల్ చేసి తన మాజీ భర్త వల్ల ప్రాణ భయం ఉందని చెప్పుకొచ్చింది . పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు . అతని వెనుకల చొక్కాలో పెద్ద కత్తిని స్వాదినం చేసుకున్నారు . పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు .  

Tags:    

Similar News