ఆటోలో సీటు బెల్టు పెట్టుకోలేదని 1000 రూపాయల జరిమానా

Update: 2019-09-15 13:47 GMT

కొత్తగా వచ్చిన వాహనచట్టాలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక పోలీసులు కూడా ఎవరికీ ఏ విధంగా ఫైన్స్ వేస్తున్నారో అర్ధం కావడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలంటే సంఘటనే మరొకటి బీహార్ లో చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేని అతనికి 1000 రూపాయల జరిమానాని విధించారు. దీనిపై సమీప స్టేషన్ అధికారికి ఫిర్యాదు కాగా ఇది పొరపాటు వల్ల జరిగిందని కానీ అతనికి జరిమానా విధించింది కేవలం తక్కువేనని అయన సమర్ధించుకొచ్చారు. 

Tags:    

Similar News