ఐదు పెళ్లిళ్లు చేసుకొని వదిలేశారు: వైఎస్‌ జగన్‌

Update: 2018-08-20 13:48 GMT

విశాఖ జిల్లాలో 241వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైయస్ జగన్  కోటవురట్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన జగన్ ప్రభత్వంపై విరుచుకుపడ్డారు. టీడీపీ పాలనలో చెరకు రైతులు బాధపడుతున్నారు. అదేంటో ఆయన ముఖ్యమంత్రి  కాగానే షుగర్‌ ఫ్యాక్టరీలు నష్టాల బాట పడుతాయి. ఇప్పటికే విశాఖ జిల్లాలోని మూడు షుగర్‌ ఫ్యాక్టరీలను మూసేశారు. ఇక తాండవ, ఏటికొప్పాక, చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం ప్రకారం అన్నింటిని నష్టాల బాట పట్టిస్తారు. ఏటికొప్పాక ఫ్యాక్టరీ 5 వేల మంది చెరకు రైతులకు బకాయి పడింది. ఇన్నిరోజులవుతున్నా ఆ డబ్బు  జమ కాకపోవడం లేదని అన్నారు. తాము అధికారంలో వస్తే రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని.. క్రాప్‌ లోన్లను తీసుకుంటే వడ్డీ భారం లేకుండా చేస్తాం. పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 12500 చెల్లిస్తామని అన్నారు జగన్. ఇదిలావుంటే సీఎం చంద్రబాబు ఐదు పార్టీలను పెళ్లి చేసుకుని వదిలేశారని.. తాజాగా కాంగ్రెస్‌తో పెళ్లికి సిద్దమయ్యారని ఎద్దేవా చేశారు. 

Similar News