రసజ్ఞ హత్యకు అసలు కారణం ఇదేనా..?

Update: 2018-06-16 06:09 GMT

ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు రసజ్ఞ అనే యువతి గొంతు కోసి  హతమార్చాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా  స్థానికులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన వంశీధర్, గోదావరిఖనికి చెందిన రసజ్ఞ మధ్య  ప్రేమ వ్యవహారం నడుస్తోంది. నిత్యం వంశీధర్ వేధింపులకు గురిచేయడంతో కొద్దిరోజులుగా రసజ్ఞ అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో రసజ్ఞ  తన  కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు అతని తల్లిదండ్రులతో మాట్లాడారు. దీంతో ఇరువురు కుటుంబాల మధ్య పంచాయితీ చేశారు పెద్దలు. పంచాయితీ సమయంలో రసజ్ఞ వెంటపడనని, ఆమెను సోదరిగా చూసుకుంటానని, ఇప్పటివరకు ఉన్న ఫొటో, మెస్సేజ్‌లను తొలగిస్తానని వంశీధర్‌ చెప్పడం తోపాటు రాతపూర్వకంగా రాసిచ్చాడు.. కానీ ఆమె మీద కోపాన్ని పెంచుకున్న వంశీధర్ ఆమె వెంటపడుతున్నాడు.  మూడు నెలల క్రితమే జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న మీసేవా కేంద్రంలో రసజ్ఞ ఉద్యోగంలో చేరింది. రెండు మూడు రోజులుగా  ప్రేమించమని వెంటపడుతున్నాడు.  శుక్రవారం కూడా ఆమె వెంటపడి వేధించడంతో రసజ్ఞ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరిమధ్య గొడవ జరగడంతో  ఆగ్రహానికి గురైన వంశీధర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి హతమార్చాడు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News