అత్తమామలే కోడలి ఫోటోను మార్ఫింగ్ చేసి..

Update: 2018-12-18 04:02 GMT

కన్నకూతురుగా చూసుకోవలసిన అత్తామామలే కోడలి పరువును బజారుకీడ్చారు. భర్త చనిపోవడంతో తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఓ మహిళ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ నగరానికి చెందిన బాధిత మహిళకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు.  అయితే ఇటీవల ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన రెండేళ్ల కూతురితో సహా అత్తమామల వద్దే ఉంటోంది ఆ మహిళ. అయితే బ్యాంకు వివరాలు చెప్పాల్సిందిగా సదరు మహిళను అత్తామామలు వేధించడం మొదలుపెట్టారు.తాను ఎంతకీ చెప్పకపోయేసరికి తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు కాదు తనను ఇంటినుంచి గెంటివేసినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Similar News