కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన ఒంటేరు ప్రతాపరెడ్డి

Update: 2018-11-26 07:49 GMT

సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాపరెడ్డి  రెడ్డి తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక  4 వేల 5వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరిని కూడా పరామర్శించలేదంటూ ఆయన విమర్శించారు. రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న తనపై కేసీఆర్ 27 కేసులు పెట్టించారంటూ ఆరోపించారు. మంత్రి హోదాలో ఉన్న హరీష్‌రావు గల్లీ లీడర్ తరహాలో వ్యవహారిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను భయంబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, ఈసీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. తనపై గెలిచేందుకు ఇప్పటి వరకు 50 కోట్లు ఖర్చు పెట్టారంటూ విమర్శించారు. తన ఫోన్లు ట్యాప్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నా ఈసీ పట్టించుకోవడం లేదని ఒంటేరు ఆగ్రహం వ్యక్తం చేశారు .  
 

Similar News