పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు : కేటీఆర్

Update: 2018-06-09 10:17 GMT

పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా.. మెరుగైన వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని.. మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఐపీఎం క్యాంపస్‌లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్‌ను మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామన్న కేటీఆర్.. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 40 నుంచి 50 శాతం పెరిగిందన్నారు. ఇటు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్  ఏర్పాటు.. వైద్య చరిత్రలోనే ఓ మైలురాయిగా.. వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

Similar News