ఇకనుంచి టీవీలో వీటికి మాత్రమే..

Update: 2018-12-20 03:10 GMT

కేబుల్‌ టీవీ అంటేనే వందల చానళ్ళు వస్తుంటాయి. అయితే కొందరు కొన్ని చానళ్లను మాత్రమే వీక్షిస్తుంటారు. అయినా కూడా వారు ఫుల్ పేమెంట్ సమర్పించుకోవాలి. ఇకపై ఆ అవసరం లేదని తేల్చింది ట్రాయ్ సంస్థ. కొత్త నిబంధనల ప్రకారం కేబుల్ టీవీ కనెక్షన్ కూడా ప్రీపెయిడ్‌ పద్ధతిలోనే చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. దీనివల్ల వినియోగదారులు తాము చూడదలచుకున్న చానళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించేలా వీలు కల్పించనుంది. ట్రాయ్ కొత్త నిబంధనలు ప్రకారం అన్ని టీవీ నెట్‌వర్క్‌లు తమ ఛానెళ్లను వీక్షించేందుకు గాను ఒక సమిష్టి ధరను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ప్యాక్ ద్వారానే వివిధ చానళ్లను వీక్షించే అవకాశం ఉంది. ట్రాయ్ నిర్ధేశించిన ప్యాక్ ల వివరాలు ఇలా ఉన్నాయి.. 250కి మించి ఛానెల్స్ వచ్చే ప్రాంతాల్లో రూ.350 నుంచి రూ.400 వరకు కేబుల్ ఆపరేట్లకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో కచ్చితంగా నెలకు రూ.200 నుంచి రూ.250 వరకు చెల్లించాల్సి ఉంటంది. అలాగే మధ్యభారత రాష్ట్రాల్లోని అన్ని ఛానెల్స్ ను చూడాలనుకుంటే నెలకు రూ.440 వరకు కేబుల్ ఆపరేటర్లకు చెల్లించాలి.  1నెల, 3 నెలలు, 6 నెలలకు, 1సంవత్సరం పాటు ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి ముందుగా డబ్బు ప్రీపెయిడ్ పద్దతిలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 


 

Similar News