సంధ్య ఇకలేరు..

Update: 2018-09-07 12:33 GMT

జానపదం గొంతు మూగబోయింది. తెలంగాణ జానపద కళాకారిణి సంధ్య(50)మరణించారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె నేడు తుదిశ్వాస విడిచారు. తెలంగాణ జానపద మాండలికాన్ని అవపోసన పట్టిన సంధ్య ఎన్నో వేల సభల్లో జనాలను ఉర్రూతలూగించారు. అనారోగ్యంతో గతవారం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు సంధ్య. క్రమంగా ఆమె ఆరోగ్యం విషమించడంతో గుండెపోటుతో మృతిచెందారు. 2017లో సంధ్యకు ఉత్తమ జానపద కళాకారిణి అవార్డు అందుకున్నారు. కేసీఆర్‌ చేతుల మీదిగా అవార్ఢుతో పాటు రూ.లక్ష పురస్కారం అందుకున్నారు. సంధ్య మ‌ృతి పట్ల పలువురు నాయకులు,కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

Similar News