తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

Update: 2018-11-12 07:36 GMT

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమయింది. డిసెంబరు ఏడో తేదీన జరిగే పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘానికి సమచారం అందింది. దీంతో ఇవాల్టి నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇవాల్టి నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లు దాకలు చేయడానికి అవకాశం ఉంది. ఏడు రోజుల పాటు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20, 21 తేదీల్లో నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. అదే నెల 11న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

Similar News