దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం..

Update: 2018-12-10 04:21 GMT

దేశీయ స్టాక్‌ మార్కెట్లు డిసెంబర్ 10 న భారీ నష్టాలతో  ప్రారంభమయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 158 పాయింట్లు పడిపోయి 10,581 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రధాన ఇండెక్సులు 3 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఈ కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమవుతాయని అంచనా వేస్తోంది. అలాగే రేపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశమున్నట్టు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Similar News