ఏసీ కోచ్ లో సేదతీరుతున్న నాగుపాము!

Update: 2018-05-07 11:57 GMT

చెట్లు కాదు పుట్టలు కాదు ఏకంగా రైల్లోని ఏసీ కోచ్ లో సేదతీరింది ఓ నాగుపాము. సాధారణంగానే రైల్లో బొద్ధింకలు , పురుగులు అంటేనే భయపడే జనాలు నాగుపామునే చూసి షాక్ అయ్యారు. ప్రాణభయంతో కాసేపు గజగజ వణికారు. రైల్లోకి నాగుపాము దూరిన ఘటన భువనేశ్వర్.. అమృత్ సర్ ఎక్స్ ప్రెస్ లో చోటుచేసుకుంది. రైల్లోని ఏసి ఎ–1 బోగీ 32వ నంబరు బెర్తు లో ఓ యువతి నిద్రిస్తోంది.. ఈ క్రమంలో తన మీదకు ఏదో పాకుతోన్నట్టు అనిపించి పైకి లేచి చూసింది. ఇంతలో నాగుపాము బుసలు కొడుతూ పడిగెత్తింది. అంతే ఒక్క ఉదుటున ఆ యువతీ తను కప్పుకున్న దుప్పటిని పాముపై విసిరి  బెడ్ మీద నుంచి కిందకు దూకింది. జనాలు కేకలు వేయడంతో భయాందోళన చెందిన పాము బెడ్ కిందకు దూరి కాసేపు సేదతీరింది. ఇంతలో అక్కడికి చేరుకున్న భద్రత సిబ్బంది పామును పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. 

Similar News