గజ్జెల కాంతంకు షోకాజ్‌ నోటీసులు

Update: 2018-12-14 12:19 GMT

టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతంకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఉత్తమ్, పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చర్యలెందుకు తీసుకోకూడదని క్రమశిక్షణ సంఘం ప్రశ్నించింది. రేపటిలోగా వివరణ ఇవ్వాలని గజ్జెల కాంతానికి క్రమశిక్షణ సంఘం నోటీసు ఇచ్చింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ ఓటమి చెందని పీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం మండిపడ్డారు. ఉత్తమ్‌ స్వార్థప్రయోజనాల కోసం పార్టీని నాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ గెలవకపోతే తప్పుకుంటానన్న ఉత్తమ్ ఇప్పుడేమంటారు? అని ప్రశ్నించారు. ఆయన పీసీసీ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. బీసీ లేదా ఎస్సీ నాయకుడికి పీసీసీ అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. హౌసింగ్ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తమ్‌ కోవర్టుగా మారారని వ్యాఖ్యానించారు. పొత్తుల విషయంలో ఆయన హైకమాండ్‌ను తప్పుదోవ పట్టించారని గజ్జెల కాంతం పేర్కొన్నారు.

Similar News