హీరోయిన్ త‌మ‌న్నాకు చేదు అనుభ‌వం

Update: 2018-01-29 01:52 GMT

హీరోయిన్ త‌మ‌న్నాకు చేదు అనుభ‌వం ఎదురైంది. హైద‌రాబాద్ లోని  హిమాయత్ నగర్ లో మల్ బార్ గోల్డ్ షాప్ ప్రారంభోత్సవానికి వ‌చ్చిన ఆమెపై ఓ దుండ‌గుడు చెప్పుతో దాడి చేశాడు. జ్యువెల‌రీ మాల్ ప్రారంభిస్తుండ‌గా కొద్ది దూరంలో ఉన్న ఆ దుండ‌గుడు చెప్పు విసిరాడు.  
 అయితే, అతను విసిరిన బూటు, ఆమెకు కొంత దూరంలో పడింది.దీంతో, అతనిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, తమన్నాపై షూ విసిరిన వ్యక్తి పేరు కరీముల్లా అని సమాచారం. 

Similar News